పత్తి కొనుగోలుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకుని రావాలి పత్తి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పన రైతులు తమ బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లీంక్ చేయాలి పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా :ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పత్తి కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 Planned Measures For Cotton Purchase - District Collector Sandeep Kumar Jha , Ru-TeluguStop.com

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్ ను అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,పత్తి పంటకు మద్దతు ధర అందేలా చూసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటీ నియమించిందని, మార్కెట్ లో నాణ్యమైన పత్తి పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువగా రేట్ పలికితే వెంటనే సి.సి.ఐ కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42 వేల 390 ఎకరాలలో పంట వేయడం జరిగిందని, 30 వేల 28 మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి వస్తుందని అంచనా తో పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో 5 జిన్నింగ్ మిల్లులలో కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.సుద్దాల లోని కావేరి కాటన్ ఇండస్ట్రీస్, నాంపల్లి లోని లక్ష్మీనరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లి లోని లక్ష్మీ కాటన్ ఇండస్ట్రీస్, గొల్లపల్లిలోని సప్తగిరి కాటన్ ఇండస్ట్రీస్, తాళ్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.

కొనుగోలు కేంద్రాలకు పత్తి పంట తీసుకొని వచ్చే రైతులు తమ బ్యాంకు ఖాతాలు ఆధార్ కార్డుతో లీంక్ చేయాలని, దీనిపై రైతులలో అవసరమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.కొనుగోలు కేంద్రాలలో అవసరమైన తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు మొదలగు సామాగ్రి అందుబాటులో ఉంచాలని అన్నారు.

పొడువు పింజ రకం పత్తి పంట క్వింటాల్ కి 7521 రూపాయలు మద్దతు ధర ప్రకటించామని, పత్తి పంట కొనుగోలు నిమిత్తం జిన్నింగ్ మిల్లులో నీరు , టాయిలెట్  అవసరమైన పరికరాలు మొదలగు సౌకర్యాలు సమకూర్చాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.వ్యవసాయ మార్కెట్ యార్డులలో పత్తి పంట అమ్మకాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర కంటే తక్కువకు పత్తి పంట అమ్మవద్దని, మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దని, ప్రైవేట్ వ్యాపారుల వద్ద మద్దతు ధర లభించని పక్షంలో నేరుగా జన్మింగ్ మిల్లులకు వచ్చి పత్తి పంట అమ్ముకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న పత్తి పంటను క్రాప్ బుకింగ్ ప్రకారం సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులకు మ్యాప్ చేయాలని అన్నారు.

ఒకే రోజు అధిక సంఖ్యలో రైతులు పత్తి తీసుకుని రాకుండా జాగ్రత్త వహించాలని రైతులకు జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం ప్రకారం టోకెన్లు జారీ చేయాలని అన్నారు.పత్తి తరలింపు కోసం అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.

పత్తి పంట కొనుగోలు ఉపయోగించే వెయింగ్ యంత్రాల నాణ్యత పరిశీలించాలని అన్నారు.రైతులు తాము పండించిన పత్తి పంట తేమ శాతం 8 నుంచి 12% మధ్యలో ఉండేవిధంగా చూసుకొని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ కోరారు.

పత్తి పంట తేమ శాతం పై కర పత్రాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ అన్నారు.పత్తి కొనుగోలు కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని అన్నారు.

పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద అగ్ని ప్రమాద నివారణ చర్యలు పటిష్టంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో అగ్నిమాపక వాహనాలు ఎప్పుడైనా కొనుగోలు కేంద్రాలకు వచ్చేందుకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.

వివిధ శాఖల అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా సరైన ధర కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.పత్తి పంట కొనుగోలు చేసిన 48 గంటల లోగా రైతులకు చెల్లింపులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పత్తి పంట కొనుగోలు, మద్దతు ధర, జిన్నింగ్ మిల్లుల ఏర్పాట్లు పై ప్రచారం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, లీగల్ మెట్రాలజీ అధికారి రూపేష్ కుమార్, సెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి డి.ప్రకాష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, డిఎం సివిల్ సప్లై రజిత, సీసీఐ అధికారి శక్తి వేల్, ఏ.ఎం.వీ.ఐ రజనీ దేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శిలు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube