భోజనం ఎట్లా ఉంది?మెస్ నిర్వహణ ఎవరు చేస్తున్నారు.నర్సింగ్ కళాశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హాస్టల్ లో భోజనం బాగుంది కలెక్టర్ కు విద్యార్థుల సమాధానం నర్సింగ్ స్టూడెంట్స్ తో కలిసి భోజనం చేసిన కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా :మెస్ ను ఎవరు నిర్వహిస్తున్నారు? మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారా?అంటూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నర్సింగ్ విద్యార్థులను ప్రశ్నించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కళాశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.నర్సింగ్ కళాశాలలో ఎంతమంది చదువుతున్నారు హాస్టల్ లో ఎంతమంది ఉంటున్నారని ప్రార్ధన మీకు వివరాలను ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ నీ అడిగి తెలుసుకున్న అనంతరం జిల్లా కలెక్టర్ మెస్ ను పరిశీలించారు.
మెస్ నిర్వహణ తీరుపై విద్యార్థులను, ప్రిన్సిపల్ ప్రశ్నించారు.హాస్టల్ లో 375 మంది విద్యార్థిని ఉంటున్నారని తెలిపారు.విద్యార్థులకు వచ్చే స్టైపండుతో నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు.మెనూ బాగుందని కలెక్టర్ కు విద్యార్థినిలు తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ , అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ విద్యార్థులు, ప్రిన్సిపల్ తో కలిసి భోజనం చేశారు.ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా…అని విద్యార్థులను భోజనం చేస్తూనే అడిగారు.
కళాశాలలో ఒకే బోర్ ఉండటంతో వాటర్ కు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని విద్యార్థులు జిల్లా కలెక్టర్ తెలుపగా అదనంగా మరో బోరు మంజూరు చేస్తామని తెలిపారు.అట్లాగే అవసరాన్ని బట్టి అవసరమైతే మరో సంపు నిర్మాణం కూడా చేపడతామన్నారు.
విద్యార్థుల విజ్ఞప్తి మేరకు హాస్టల్ కు చపాతి మేకర్ ను అందిస్తామన్నారు.ఆసుపత్రికి వెళ్లేందుకు రెండు బస్సులు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని జిల్లా కలెక్టర్ దృష్టికి విద్యార్థులు తీసుకురాగా అవసరమైన సందర్భంలో ఆర్టీసీ నుంచి కూడా బస్సులను అద్దెకు తెప్పిస్తామని జిల్లా కలెక్టర్ గారికి తెలిపారు.
అలాగే ఆసుపత్రిలో విద్యార్థులు భోజనం చేసే సమయంలో ప్రత్యేక రూం ఉందా అని జిల్లా కలెక్టర్ అడిగారు.లేదని తెలపడం తో విద్యార్థుల భోజనం కోసం ప్రత్యేక రూమును ఏర్పాటు చేస్తామన్నారు.