చర్మంపై జిడ్డును తొలగించే అద్భుతమైన నిమ్మ ప్యాక్స్

నిమ్మరసం అనేక చర్మ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు.నిమ్మరసంను పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

 Oily Skin Best Lemon Face Packs Details, Oily Skin, Face Packs, Lemon Face Packs-TeluguStop.com

చర్మంలో ఉన్న అధికంగా ఉన్న నూనెను తొలగించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంపై జిడ్డును తొలగించటంలో సహాయపడుతుంది.

నిమ్మతో పేస్ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

రెండు స్పూన్ల టమోటా గుజ్జులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జిడ్డు తొలగిపోతుంది.

ఒక స్పూన్ అలోవెరా జెల్ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 10నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

Telugu Aloe Vera Gel, Egg White, Face, Facial, Lemon Face, Lemon, Oily Skin, Ski

రెండు స్పూన్ల గ్రీన్ టీలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే జిడ్డు సమస్య తొలగిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పాలపొడి, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి.

పేస్ట్ అయ్యేవరకు బాగా కలపాలి.ఈ పేస్ట్ ని ఫిషియల్ స్కిన్ పై సున్నితంగా అప్లై చేయండి.

అయిదు నుంచి పది నిమిషాల తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.ఈ పేస్ట్ ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా గుర్తించదగ్గ ఫలితాలను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube