ఇటీవల కాలంలో అమెరికాలో మెయిల్ బాక్స్‌లపై( Mailboxes ) కుక్కల కాలి గుర్తులు( Dog Paw Signs ) బాగా కనిపిస్తున్నాయి.వీటికి అర్థం ఏంటి అని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక చర్చ మొదలయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ కుక్కలను ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేస్తారు.వాటిపై చాలా ప్రేమ కురిపిస్తారు వాటితో ఆడుకోవడం వల్ల వీరికి చాలా ఆనందం కలుగుతుంది.
కానీ, కొన్నిసార్లు ఇంటికి వచ్చే వారిపై కుక్కలు దాడి చేయొచ్చు.అవి యజమానులకు చాలా ప్రియమైనవి అయినప్పటికీ, ఇంటికి వచ్చే అతిథులు, ముఖ్యంగా పోస్ట్‌మెన్ల వంటి వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది.
అందుకే, కుక్కలను పెంచుకునే వారు తమ ఇంటికి వచ్చే వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.అమెరికాలోని పోస్టల్ సర్వీస్( Postal Service ) అనే సంస్థ ఇలాంటి ప్రమాదాల నుంచి తమ పోస్ట్‌మెన్లను కాపాడటానికి ‘PAWS’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ కార్యక్రమం ద్వారా, పోస్ట్ బాక్స్‌లపై ‘కుక్కల పాదముద్ర’ స్టిక్కర్లు అతికించారు.ఈ స్టిక్కర్లు చూసి పోస్ట్‌మెన్లు ఆ ఇంటి దగ్గర కుక్కలు ఉన్నాయని తెలుసుకునేవారు.నారింజ రంగు స్టిక్కర్ ఉన్న ఇంటిలో కుక్క ఉంటుంది.పసుపు స్టిక్కర్ ఉన్న ఇంటి పక్క ఇంటిలో కుక్క ఉంటుంది.
ఈ స్టిక్కర్లు ముఖ్యంగా కొత్త పోస్ట్‌మెన్లకు చాలా ఉపయోగకరంగా ఉండేవి.
అయితే ఇప్పుడు పోస్ట్‌మెన్లు( Postman ) కుక్కల దాడుల( Dogs Attack ) నుంచి తమను తాము రక్షించుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు.వారి దగ్గర ఉన్న స్కానర్లు ఆ ఇంటిలో కుక్క ఉందా లేదా అని చూపిస్తాయి.ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది పోస్ట్‌మెన్‌లపై కుక్కలు దాడి చేశాయి.
పోస్ట్‌మెన్‌లకు ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో శిక్షణ ఇస్తారు.కుక్కలకు దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని నేర్పిస్తారు.
కుక్క దాడి చేయబోతుంటే తమ పోస్ట్ బ్యాగ్‌ను రక్షణగా ఉపయోగించుకోవాలని చెబుతారు.అవసరమైతే కుక్కలను తరిమే స్ప్రే కూడా వాడతారు.
కుక్కల యజమానులు కూడా ఇందులో తమ వంతు బాధ్యత నిర్వహించాలి.పోస్ట్‌మెన్ వచ్చేటప్పుడు కుక్కలను ఇంట్లో ఉంచాలి, లేదా తలుపు దగ్గర నుంచి దూరంగా ఉన్న గదిలో ఉంచాలి.
బయట ఉంటే తాడుతో కట్టాలి.కంచెలు కూడా కుక్కలను బయట వారి నుంచి దూరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
భారతదేశంలో, పార్సెల్ వచ్చేవారికి హెచ్చరికగా సూచన బోర్డులు లేదా స్టిక్కర్లు పెట్టుకోవచ్చు.ఈ చిన్న ప్రణాళికతో పోస్ట్‌మెన్లు, పెంపుడు జంతువులు రెండింటినీ రక్షించవచ్చు.