సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా :సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం వివరాలు తప్పనిసరిగా సేకరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వేలో శనివారం ప్రారంభం కాగా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Collector Sandeep Kumar Jha During A Surprise Inspection Of A Comprehensive Hous-TeluguStop.com

ఎన్యుమరేటర్ బ్లాక్ పరిధిలోని 0060, 0061/A/A లో అధికారులు, సిబ్బంది సర్వే చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే మొదలు పెట్టామని తెలిపారు.ప్రభుత్వం అందించిన ప్రొఫార్మా ప్రకారం అన్ని కుటుంబాల వివరాలు తీసుకోవాలని ఆదేశించారు.

సర్వేకు వచ్చే వారికి ప్రతి కుటుంబం వారి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ సమాచారం ప్రతి పథకానికి, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రణాళికలకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు.

సర్వే చేయనున్న గ్రామాలు, వార్డ్ ల సమాచారం స్థానికులకు ఇవ్వాలని ఆదేశించారు.ఇక్కడ ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తహసిల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube