శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు.ప్రతి ఏటా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణానికి వేములవాడ రాజన్న ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది.

 Lets See Sri Sitarama Kalyanam At Vemulawada, Sri Sitarama Kalyanam ,vemulawada-TeluguStop.com

వసంత రుతువు చైత్రశుద్ద నవమి పునర్వసు నక్షత్ర యుక్తమైన అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఏటా వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా నిర్వహిస్తుంటారు.శ్రీరామనవమి రోజున జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని రాజన్న ఆలయంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

హరి హర క్షేత్రంలో ఉత్సవ మూర్తుల కు కళ్యాణ ఉత్సవం జరపడం ఇక్కడ విశేషం వేములవాడ లో జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు తెలంగాణ జిల్లాలో నుండి కాకుండా మహారాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ చెందిన వారు కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చి శ్రీ సీతారాముల కల్యాణాన్ని తనివి తీర చూడాలని, వివిధ ప్రాంతాలకు చెందిన శివపార్వతులు, జోగినీలు, వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో శివనామ స్మరణ జపిస్తూ స్వామి వారి మొక్కలు చెల్లించుకుని శివుడిని తమ నాథుడిగా భావించి వివాహం చేసుకుంటారు.

ఉదయాన్నే రాజన్న ఆలయంలోని ధర్మ గుండంలో స్నానాలు ఆచరించి, తర్వాత శివయ్యను దర్శించుకొని, శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే స్థలానికి చేరుకొని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జోగినిలు, శివపార్వతులు అందంగా ముస్తాబై పెళ్లి పీటలు ఎక్కుతారు.

పట్టు వస్త్ర్రాలను ధరించి, పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించుకొని సీతా రాముల కళ్యాణం జరిగే సన్నిధికి చేరుకుంటారు.శ్రీ రాములవారు సీతమ్మకు తాళి కట్టే సమయంలోనే , జోగినీలు శివపార్వతులు శివుడు తమను వివాహం చేసుకున్నట్లు భావించి ఒకరి పై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ వివాహం అయినట్లు భావిస్తారు.

శ్రీరామ నవమిరోజు జోగినీలు శివయ్యను పరిణయం ఆడుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube