షాదీ ఖానా లో నెలకొన్న సమస్యల ను పరిశీలించిన ఉపసర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో మైనారిటీ ల కోసం నిర్మించిన షాదీ ఖానా లో నెలకొన్న సమస్యల ను సోమవారం స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.సదరు పనులు చేసిన గుత్తేదారు కరెంట్ ఫిట్టింగ్,మరుగు దొడ్లు నిర్మించలేదు అని పైన వాటర్ ట్యాంక్ బిగించలేదని ఎలాంటి పూర్తిస్థాయిలో పనులు చేయకుండా కాంట్రాక్టర్ కు బిల్లు ఎలా ఇచ్చారో అని సంబంధిత అధికారుల పనితీరు పై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.

 The Sub-sarpanch Examined The Problems In Shadi Khana, Shadikhana, Ellareddypeta-TeluguStop.com

అదే విధంగా బోరు మోటార్ బోరు గుంతలో ఇరుక్కుందనీ బోరు ను ప్లేషింగ్ చేయాలని,వంట గది నిర్మించాలనీ పెండింగ్ ఉన్న పనులను ఆమె గుర్తించారు.త్వరలో ఎల్లారెడ్డి పేట కు రానున్న మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరింపజేసుకుందామని ఆమె అన్నారు.

ఆమె వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్,మైనార్టీ నాయకులు ఇంతియాజ్,రియాజ్,అసిఫ్,సాజిద్ నేవూరి మహేందర్ రెడ్డి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube