రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్, వెంకటాపూర్ గ్రామాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి, పిసిసి మెంబర్ నాగుల సత్యనారాయణ గౌడ్ తో కలిసి జెండా గద్దెల వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలవేసి శాలువతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు, దొమ్మాటి నర్సయ్య, వంగ గిరిధర్ రెడ్డి, షేక్ గౌస్, మానుక నాగరాజు, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గౌడ్,హరిదాస్ నగర్, వెంకటాపూర్ గ్రామస్తులు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట,గంభీరావుపేట మండలల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.