కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామచంద్రం..

రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా రోడ్డ రామచంద్రం ను నియమించినట్లు బుధవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పంపిన నియామక పత్రాన్ని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేశారు.

 Ramachandram As District Secretary Of Congress Party, Ramachandram ,district Sec-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన రోడ్డ రామచంద్రం జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దండు శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.

మండల కార్యదర్శిగా హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ఊరడి ఎల్లయ్య బాధ్యతలు చేపట్టారు.మండల అధికార ప్రతినిధిగా మానుక నాగరాజు బాధ్యతలు స్వీకరించారు.వీరిని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు చెన్ని బాబు, వంగ మల్లారెడ్డి, కొత్తపల్లి దేవయ్య, అన్నవేని రవి ,ఎండి రఫీక్, సూడిద రాజేందర్ ,బిపేట రాజు, తిరుపతి గౌడ్, బాలయ్య, పందిర్ల శ్రీనివాస్, కోనేటి పోచయ్య, ఎండి హిమాం, ఉప్పుల రవి ,చెట్పల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube