శ్రీ దుర్గా మాత వద్ద మహా చండీ యాగం పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల( Navaratri Celebrations ) సందర్భంగా పశువుల అంగడి బజార్లో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా మాత మంటపం( Durga Matha ) వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ , చండీ హోమం, చండీ హావనం , పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత హైదరాబాద్ కు చెందిన సంస్క్రిట్ డాక్టరేట్ రంగి సత్యనారాయణ శర్మ , రాచర్ల కృష్ణ మూర్తి శర్మ , వేణుగోపాల చార్య లు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక విశేష పూజా తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు , చండీ హోమం లో ఎనిమిది మంది దంపతులు పాల్గొన్నారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా అమ్మవారు భక్తులకు గురువారం శ్రీ మహా చండీ దేవి అవతారంలో దర్శన మిచ్చారు, విగ్రహ మండపం దగ్గర ఉదయం రాత్రి పలు రకాలైన విశేష పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు శ్రీ రామోజీ ప్రవీణ్ పేర్కొన్నారు.

 Durga Matha Maha Chandi Yagam Yellareddypet,yellareddypet,durga Matha Maha Chand-TeluguStop.com

భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత హైదరాబాద్ కు చెందిన సంస్క్రిట్ డాక్టరేట్ రంగి సత్యనారాయణ శర్మ శ్రీ మహాచండీ( Maha Chandi Yagam ) అమ్మవారిని ఆరాధించడం వల్ల జరుగు ప్రయోజనాలు అద్భుత విషయాల గురించి భక్తులకు వివరించారు, భక్తులను భక్తి మార్గంలో తన్వయత్వం చందేటట్టు బోధిస్తున్న తన ఆధ్యాత్మికత భక్తులను విశేషంగా ఆకర్షించింది, అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా సుమారు 1500 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారిని స్థానిక ప్రజా ప్రతినిధుల, బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ నాయకులు దర్శించుకుని శ్రీ దుర్గా మాత కృపకు పాత్రులు అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube