కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులపంపిణి

రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డు చంద్రంపేటలో పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్( Kalyana Lakshmi, Shadi Mubarak ) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేయబడుతున్న సంక్షేమ పథకాలను తద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరిస్తూ ఇలాంటి ఎన్నో ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా నిర్వహిస్తు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ప్రజలందరూ రుణపడి ఉండాలని అన్నారు.

 Kalyana Lakshmi, Shadimubarak Cheques Distribution, Shadimubarak-TeluguStop.com

ఈ సంక్షేమ పథకాల ఫలాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు కృతజ్ఞతగా బిఆర్ఎస్ పార్టీని రాబోయే శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ సందర్భంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు చీర కనుము, పసుపు కుంకుమ స్వీట్ బాక్స్ లను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు శ్రీ పతి వినోద,మొగిలి విజయకు కానుకగా అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు పాతూరి రాజిరెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు , వీరగోని శ్రీనివాస్ గౌడ్ , బిఆర్ఎస్ పార్టీ టౌన్ పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, కోలపురం నర్సయ్య,అన వేణి పర్షరాములు, పులి మల్లేశం, అబ్బగోని జంపయ్య, పసుల సతీష్, కత్తెర రాజు, ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube