రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా సాయి ప్రకాష్ కు శనివారం బాధ్యతలు అప్పగించిన బీజేపీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సాయికిరణ్ నాయక్.అలాగే జాయింట్ కన్వీనర్లుగా శాగ లక్ష్మణ్,జంగీటి నరేంద్ర,గెంటే రవి,దండు నవీన్, భూక్యా నవీన్, బొడ్డు సురేష్లను నియమించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతానికి అంకిత భావంతో నీతి, నిజాయతి, నిబద్దత, క్రమశిక్షణ, చిత్త శుద్ధితో పని చేస్తామనీ అలాగే అన్ని కార్యాక్రమాలలో,చురుగ్గా పాల్గొని ప్రజలు ఎదురుకొంటున్న సమస్య ను, బిఆర్ఎస్ పాలన లో జరిగే అవినీతి అక్రమాలను ఎండగడుతూ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజల కు తెలిసేవిధంగా పని చేస్తామనీ అన్నారు.ఈ నియమకానికి సహకరించిన బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దాసరి గణేష్, జిల్లా కన్వీనర్ సాయి కిరణ్, అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి,లీగల్ సెల్ కన్వీనర్ ఉచ్చిడి శరత్ రెడ్డి, పొన్నాల కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







