ఎంత గొప్ప నటులు అయితేనేం ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.ఉదాహరణకు ఎస్ వి రంగారావు గారిని తీసుకుంటే ఆయనకు సీన్ లో సావిత్రి గారు ఉంటె ఒక రకమైన భయం లాంటిది ఉంటుంది.
మాములుగా ఎలాంటి సందర్భం లోను సీన్ పేపర్ చేసుకోకుండానే డైలాగ్స్ చెప్పగలిగే ఆయన సావిత్రి ఉందంటే ముందు ఒకసారి సీన్ పేపర్ చదివాకే షూటింగ్ మొదలు పెడతారు.అలాగే అక్కినేని నాగేశ్వర రావు( Akkineni Nageswara Rao ) విషయానికి వస్తే అయన తన సినిమా జీవితంలో ఒక ముగ్గురు వ్యక్తులు సెట్లో ఉంటె చాల భయపడేవారట.
ఆ ముగ్గురు ఎవరంటే ఒకరు రేలంగి, మరొకరు సూర్యకాంతం( Suryakantham ), చివరగా ఎస్ వి రంగారావు( S.V.Ranga Rao ) గారు.

ఈ ముగ్గురు నటన పరంగా ఎలాంటి పాత్రలు చేసిన, గొప్ప నటులుగా ఇండస్ట్రీ లో లెజెండ్స్ గా కొనసాగారు.అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు ఫ్రేమ్ లో ఉన్న కూడా అక్కినేని కి ఎంతో జాగ్రత్తగా ఉండేవాడట.అందుకు గల ముఖ్య కారణం పైన చెప్పుకున్న ముగ్గురు నటులు కూడా తమ హావభావాలతో, ఆహార్యంతో సీన్ ని తమ వైపు తిప్పేసుకునే వారట.
అందుకే వారు సినిమా టైం లో ఎలా రిహార్సల్స్ ఎలా చేస్తున్నారో బాగా గమనించి వారికి మించిన ఎక్సప్రెషన్ ఇవ్వడానికి బాగా ప్రయతించేవారట.ఆలా అక్కినేని ఎలాంటి సన్నివేశాన్ని అయినా తనకు ప్రాముఖ్యత ఉండేలా మల్చుకునేవారట.

ఇక ఈ విషయాన్నీ అక్కినేని వారు తన తోటి నటీనటులతో కూడా పంచుకునేవారట.కేవలం అక్కినేని మాత్రమే కాదు ఆ టైం లో ఉన్న చాల మంది నటీనటుల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండేది.డైలాగ్స్ చెప్పే విధానం, అందుకు వారు ఇచ్చే ఎక్సప్రెషన్ చాల పీక్స్ లో ఉండేవి.సినిమా చూసే ప్రేక్షకుడు చూపు వారి పైననే ఉండేది.

అందుకే హీరో ఎవరైనా కూడా ఈ నటీనటులు సినిమాలో ఉండేందుకు చిత్ర బృందం ప్రయతించేవారట.ఇక సావిత్రి ని సెట్ లో ఉన్న మిగతా నటీనటులు కాస్త జాగ్రత్తగా ఉండేవారట.ఆ కాలంలో ఎన్ని సినిమాలు చేసిన నెల జీతాల పైన పని చేసేవారు కాబట్టి సినిమా వ్యయం కూడా పెద్దగా ఉండేది కాదు.







