బెల్లంకొండ శ్రీనివాస్, నుష్రత్( Bellamkonda Srinivas, Nushrat ) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఛత్రపతి మూవీ ( Chhatrapati movie )100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కింది.ఈ సినిమా 2023 సంవత్సరం మే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటి నుష్రత్ మాట్లాడుతూ క్రేజీ మూమెంట్ గురించి చెప్పుకొచ్చారు.గతంలో ఓ ఫ్యాన్ మా ఇంటి ముందు చాలా బహుమతులు పెట్టి వెళ్లిపోయాడని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ బహుమతులలో రెండు ముక్కలైన లవ్ సింబల్ ఉందని ఆ ముక్కలలో ఒకదానిపై నా పేరు మరోదానిపై ఆ వ్యక్తి పేరు రాసి ఉందని ఆమె తెలిపారు.వాటిని చూసి నేను షాక్ అయ్యానని అయితే ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని ఆమె కామెంట్లు చేశారు.ఆ వ్యక్తికి నా ఇంటి అడ్రస్ ఏ విధంగా తెలిసిందో అనే భయం కూడా వేసిందని నుష్రత్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ నాకు కూడా అదే తరహా పరిస్థితి ఎదురైందని అన్నారు.ఈ మధ్య కాలంలో కారు ఎక్కుతుండగా ఒక వ్యక్తి నా కారులో ప్రవేశించి ఫోటో కావాలని అడగగా సెల్ఫీ ఇచ్చి కారు దిగాలని సూచించానని ఆయన అన్నారు.ఆ సమయంలో నేను షాకయ్యానని సాయిశ్రీనివాస్ వెల్లడించారు.
ఆ తర్వాత లవ్ గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లవ్ గురించి చెప్పాలంటే ప్రేమ అనేది మాటల్లో వర్ణించలేనిదని అన్నింటికంటే విలువైన ఎమోషన్ లవ్ అని ఆయన అన్నారు.ప్రస్తుతానికి నేను సింగిల్ కానీ నాకు కూడా కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయని బెల్లంకొండ శ్రీనివాస్ వెల్లడించారు.తెలుగు ఛత్రపతి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.







