బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల పార్టీలు మారుతున్నారని విమర్శించారు.
ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు అందరి ఇళ్ల చుట్టూ ఈటల తిరుగుతున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు.కోట్లు ఇస్తాం.
పార్టీలోకి రండి అంటూ దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు.ఈ క్రమంలో ఈటల ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.







