పొట్ల‌కాయ అంటేనే పిల్ల‌లు పారిపోతున్నారా? అయితే ఇలా చేయండి!

పొడ‌వుగా పాములు మాదిరి ఉండే స్నేక్‌గార్డ్‌లు అదేనండీ మ‌న పొట్ల‌కాయ‌ల గురించి కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు.ప్ర‌త్యేక‌మైన రుచిని క‌లిగి ఉండే పొట్ల‌కాయ‌ల్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, బీటా కెరోటిన్, ప్రోటీన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో నిండి ఉంటాయి.

 Health Benefits Of Snake Gourd For Kids! Health, Benefits Of Snake Gourd, Snake-TeluguStop.com

అందు వ‌ల్ల‌నే ఆరోగ్య ప‌రంగా పొట్ల‌కాయ‌లు బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయి.కానీ, వీటిని తిన‌డానికి పిల్ల‌లు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.

పొట్ల‌కాయ అంటేనే వారు ఆమ‌డ దూరంలో పారిపోతుంటారు.

పిల్ల‌ల పేచీల‌ను త‌ట్టుకోలేక‌ త‌ల్లిదండ్రులు సైతం వారికి పొట్ల‌కాయ‌ను పెట్ట‌డం మానేస్తుంటారు.

కానీ, ఇలా చేయ‌డం వ‌ల్ల బోలె‌డన్ని ఆరోగ్య లాభాల‌ను చేతులారా పిల్ల‌ల నుంచి దూరం చేసిన‌ట్టే అవుతుంది.ఎందుకంటే, పిల్ల‌ల హెల్త్‌కి పొట్ల‌కాయ ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా చాలా మంది పిల్ల‌లు మ‌ల‌బ‌ద్ధ‌కంతో ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు పొట్ల‌కాయ‌ను వారికి పెడితే.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్యే ఉండ‌దు.

అలాగే కొంద‌రు పిల్ల‌లు నీటిని స‌రిగ్గా తీసుకోకుండా డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంటారు.అలాంటి వారికి పొట్ల‌కాయ‌ను పెడితే డీహైడ్రేష‌న్ నుంచి చాలా త్వ‌ర‌గా కోలుకుంటారు.అంతే కాదు, పిల్ల‌ల‌కు పొట్ల‌కాయ‌ను పెట్ట‌డం వ‌ల్ల.

వారిలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

వికారం, వాంతులు, విరేచనాలు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌లు ఉంటే.త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

మ‌రియు వారి మాన‌సిక‌, శారీర‌క ఎదుగుద‌ల కూడా అద్భుతంగా ఉంటుంది.

అందుకే పిల్ల‌ల డైట్‌లో ఖ‌చ్చితంగా పొట్ల‌కాయ ఉండేలా చూసుకోవాలి.

అయితే పొట్ల‌కాయ‌ను క‌ర్రీ రూపంలో పిల్ల‌లు తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.అలాంట‌ప్పుడు పొట్ల‌కాయ‌తో కట్‌లెట్, పెరుగు పచ్చ‌డి, ప‌కోడి ఇలా ర‌క‌ర‌కాల రెసిపీల‌ను తయారు చేసి వారికి పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాలి.

Health Benefits Of Snake Gourd For Kids! Health, Benefits Of Snake Gourd, Snake Gourd For Kids, Kids, Kids Health, Health Tips, Good Health, Snake Gourd - Telugu Benefitssnake, Tips, Snake Gourd

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube