షాదీ ఖానా లో నెలకొన్న సమస్యల ను పరిశీలించిన ఉపసర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో మైనారిటీ ల కోసం నిర్మించిన షాదీ ఖానా లో నెలకొన్న సమస్యల ను సోమవారం స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు.

సదరు పనులు చేసిన గుత్తేదారు కరెంట్ ఫిట్టింగ్,మరుగు దొడ్లు నిర్మించలేదు అని పైన వాటర్ ట్యాంక్ బిగించలేదని ఎలాంటి పూర్తిస్థాయిలో పనులు చేయకుండా కాంట్రాక్టర్ కు బిల్లు ఎలా ఇచ్చారో అని సంబంధిత అధికారుల పనితీరు పై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు.

అదే విధంగా బోరు మోటార్ బోరు గుంతలో ఇరుక్కుందనీ బోరు ను ప్లేషింగ్ చేయాలని,వంట గది నిర్మించాలనీ పెండింగ్ ఉన్న పనులను ఆమె గుర్తించారు.

త్వరలో ఎల్లారెడ్డి పేట కు రానున్న మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరింపజేసుకుందామని ఆమె అన్నారు.

ఆమె వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్,మైనార్టీ నాయకులు ఇంతియాజ్,రియాజ్,అసిఫ్,సాజిద్ నేవూరి మహేందర్ రెడ్డి ఉన్నారు.

వీడియో వైరల్: సెక్యూరిటీ గార్డ్​గా పిల్లి.. కథ మాములుగా లేదుగా..