తిరిగి సొంత గూటికి గంజి జైపాల్ రెడ్డి

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్( Adi Srinivas ).రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు గంజి జైపాల్ రెడ్డి శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 Jaipal Reddy Is Back To His Own Nest , Jaipal Reddy, Own Nest, Adi Srinivas, Gan-TeluguStop.com

వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గంజి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహాయ శక్తుల కృషి చేస్తానని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి,నాయకులు సంఘ స్వామి యాదవ్, చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ కోలకాని రాజు వస్తాది కృష్ణ గుర్రం తిరుపతి, మూల కిషోర్, కోయల్ కార్ మస్తాన్, తంగేళ్ల గణేష్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube