రాజన్న ఆలయంలో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన సిసిఆర్ సంస్థ..

రాజన్న సిరిసిల్ల జిల్లా 🙁 Rajanna Sirisilla District ) కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రెటరీ నెవురి రత్నాకర్, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు.దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపై సిసిఆర్ సంస్థ ఆధ్వర్యంలో తేదీ 14/6/2024న రాష్ట్ర దేవాదాయ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

 Ccr Organization Focused On The Corruption Happening In Rajanna Temple , Rajann-TeluguStop.com

దీనిలో ప్రధానంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో గత పది సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహించడం.తప్పుడు సర్టిఫికెట్స్ సృష్టించి ఏఈఓ గా పనిచేస్తున్నారు.

ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు.విజిలెన్స్ కేసులు ఉన్నవారిని ఈ ఆలయంలో కొనసాగిస్తున్నారు.

వారికి పదోన్నతి ఇచ్చుట ఇలా దేవాలయంలో అక్రమాలకు అడ్డాగా మారింది దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారికి సిసిఆర్ సంస్థ తరఫున ఆరోపణ చేసినాము ఆలయ ఉద్యోగుల పైన ఖచ్చితమైన విచారణ చేపట్టగలరని కోరుకుంటున్నామన్నారు .

దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు, టెండర్ ప్రక్రియలకు సంబంధించిన అంశాల పైన రాజరాజేశ్వర స్వామి దేవస్థానం( Sri Rajarajeswara Swamy Devasthanam )లో నిర్వహించబడటం లేదన్నారు.కావున ఆలయ ఉద్యోగుల పైన సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులు అయిన వారిని కఠినంగా శిక్షించగలరని సిసిఆర్ సంస్థ తరఫున కోరారు.గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం గమనార్హం అని అన్నారు.

ఇప్పటికైనా ఆలయ ఉద్యోగులపై తక్షణమే దేవదాయ కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు నెవూరి రత్నాకర్,( Nevuri Ratnakar ) తాళ్లపల్లి నాగరాజు, ఈసంపల్లి సంతోష్, కొక్కు గోపాలకృష్ణ, చౌటపల్లి వెంకటేశం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube