శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి - సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి

రాజన్న సిరిసిల్ల జిల్లా: శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి( Sri Shiva Bhakta Markandeya Swamy ) జయంత ఉత్సవాలలో సిరిసిల్ల ప్రజలు, పద్మశాలి కుల బాంధవులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపాల్ చైర్మన్ జిందం కళ చక్రపాణి( Municipal Chairman Jindam Kala Chakrapani ) పిలుపునిచ్చారు.శనివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సంఘ కార్యాలయంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు మరియు శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర ఆహ్వాన కరపత్రాలను పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ టిఎస్పిటిడిసి మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ తో కలసి మున్సిపాల్ చైర్మన్ కళ చక్రపాణి అవిష్కరించారు.

 Make Sri Shiva Bhakta Markandeya Swamy Jayanti Celebrations A Success Jindam Kal-TeluguStop.com

ఈ సందర్బంగా జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.ఈనెల 12వ తేదీ సిరిసిల్ల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేదకు, పద్మశాలి సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఉదయం నిర్వహించే హోమ పూజా కార్యక్రమాల నుండి సాయంత్రం సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుండి

సిరిసిల్ల పట్టణంలో వైభవంగా నిర్వహించే శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర మహోత్సవంలో సిరిసిల్ల ప్రజలు పద్మశాలి కుల బాంధవులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గాజుల బాలయ్య , పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలి సత్యం,, పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కామిని వనిత, బోల్లి రామ్మోహన్ ,యేల్ల లక్ష్మీనారాయణ, గుజ్జే తార, మోర రవి, రాపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube