ప్రతి బాలిక పాఠశాలలో అడ్మిషన్ పొందేలా ప్రత్యేక శ్రద్దతో బడి బాట నిర్వహించాలి::జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) వ్యాప్తంగా జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాఠశాలలో బాలికల నమోదు శాతం పెంపొందించడం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి బాలిక తప్పనిసరిగా పాఠశాలల్లో ఎనరోల్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో బడిబాట కార్యక్రమం నిర్వహణ పై రివ్యూ నిర్వహించారు.

 Badi Bata Should Be Conducted With Special Care To Ensure That Every Girl Gets A-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రతి ఇంటిని సందర్శించి పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యార్థులుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా బాలికల ఎనరొల్మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలికలు ఎక్కడ డ్రాప్ ఔట్ కాకుండా చూడాలని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సైతం బడిబాట కార్యక్రమంలో పాల్గొంటూ బాలికలు ఎక్కడ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బాలికల తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

బాలికలు పదవ తరగతి ముగిసిన తర్వాత కూడా ఇంటర్ చదివేల వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి మండల సూపర్వైజర్ వారి పరిధిలో గల బాలికల పై శ్రద్ధ వహిస్తూ వారు చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా శారీరక లోపంతో ఉన్న చిన్నారుల వివరాలు సేకరించాలని, వారికి సైతం విద్యా అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, దివ్యాంగుల చిన్నారుల జాబితాను సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలలో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ బాల కార్మికులు తప్పకుండా చర్యలు తీసుకోవాలని, పిల్లలంతా తప్పనిసరిగా పాఠశాలలో నమోదు కావాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, హోటల్స్, ఇట్టుక బట్టిలను తనిఖీ చేసి ఎవరైనా బాల కార్మికులు కనిపిస్తే వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

వలస కూలీల పిల్లలు సైతం పాఠశాలలో నమోదయ్యేలా జాగ్రత్త వహించాలని అన్నారు.జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల కింద నమోదై జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకుంటున్నారో లేదో పరిశీలించాలని, నిడదలు చదువుకొని పక్షంలో వెంటనే వారిని ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులుగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జూన్ 6 నుంచి జూన్ 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు.జూన్ 8 నుంచి జూన్ 10 వరకు 3 రోజులపాటు ఇంటింటికి తిరిగి పిల్లలందరూ పాఠశాలలో నవోదయల చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించి ప్రతి గ్రామంలో గ్రామ రిజిస్టర్లు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.

గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే కలిగే లాభాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలు అందుబాటులో ఉన్న నైపుణ్యం అనుభవం కలిగిన ఉపాధ్యాయుల వివరాలు వివరించాలని విద్యాశాఖ అధికారి అధికారులకు సూచించారు.

గ్రామాలలో ఇప్పటివరకు పాఠశాలల్లో( schools ) నమోదు చేసుకుని పిల్లలను గుర్తించి వారిని వెంటనే పాఠశాలల్లో నమోదు చేయాలి, ప్రత్యేక విద్య అవసరమున్న విద్యార్థులను గుర్తించి వారిని భవిత సెంటర్లో నమోదు చేయాలని అన్నారు.

జూన్ 11న ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి బడిబాట కార్యక్రమంలో జరిగిన పురోగతిని చర్చించాలని, జూన్ 12న ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనులు వివరించాలని, జూన్ 13న జిల్లాలో చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమం గురించి పాఠశాలలో వివరించాలని, జూన్ 14న ప్రాథమిక విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ అధికారి సూచించారు.జూన్ 15న బాలికల విద్యా ప్రాముఖ్యతను వివరించాలని జూన్ 18న ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐవిపి ప్యానల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన విద్యార్థులకు ప్రారంభించాలని, విద్యార్థులచే మొక్కలు నాటించాలని, జూన్ 19న క్రీడ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారి అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ శేషాద్రి, జెడ్పీ సీఈవో ఉమరాణి, జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube