జిల్లావ్యాప్తంగా దంచి కొట్టిన వడగండ్ల వాన.

Hailstorm Lashed Across The District , Vemulawada Chandurthi, Rudrangi, Boinipalli Tangallapalli, Pratapa Ramakrishna, Gundadi Venkata Reddy

వర్షం దాటికి కుదేలవుతున్న రైతాంగం.రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శనివారం వడగండ్ల వాన దంచి కొట్టడంతో కుదేలవుతున్న అన్నదాత.ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి,గంభీరావుపేట, ముస్తాబాద్, సిరిసిల్ల, కోనరావుపేట,వేములవాడ చందుర్తి,రుద్రంగి,బోయినిపల్లి తంగళ్ళపల్లి లో శనివారం సాయంత్రం భారీగా వడగండ్ల వర్షం కురిసింది.దీంతో వేలాది ఎకరాలలో రైతులు వేసిన వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

 Hailstorm Lashed Across The District , Vemulawada Chandurthi, Rudrangi, Boinipal-TeluguStop.com

ప్రస్తుతం వరి పొలాలు పొట్టదశలో ఉన్నాయి.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతింటుండడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

రైతులను ఆదుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాడి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్,దూస శ్రీనివాస్,బీజేపీ మండల అద్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, బందారపు లక్ష్మా రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube