వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి - కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య సోమవారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు రాచర్ల బొప్పాపూర్, కోరుట్ల పేట,ఎల్లారెడ్డిపేట వరి పంటలను పరిశీలించారు.

 Compensation Should Be Given To The Farmers Who Lost Due To Hailstorm Details, C-TeluguStop.com

వడగండ్ల వాన వలన రైతులకు సుమారు 40 నుంచి 60 శాతం వరకు నష్టం జరిగిందన్నారు.రైతులు వరి పంటకు కావలసిన పెట్టుబడి అంతా పెట్టి తీరా చేతికి వచ్చే సమయానికి నష్టం జరగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల నుండి ఎన్ని సర్వేలు జరిపిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

కోరుట్ల పేట శివారులో పంట నష్టం అంచనా వేస్తున్న ఏఈఓ అనురాధ దృష్టికి పంట నష్టాన్ని వివరించామన్నారు.సర్వేలకే పరిమితం కాకుండా పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, కోరుట్లపేట సర్పంచ్ దేవానందం,చెన్ని బాబు మేడిపల్లి రవీందర్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్ రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube