బస్ సౌకర్యం కల్పించాలని వినతి.రాజాన్న సిరిసిల్ల జిల్లా :బిసి సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్( Ponnam Prabhakar ) ను బుదవారం ఉదయం ఎల్లారెడ్డి( Yellareddy ) పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్, శ్రీనివాసులుహైదరాబాద్ సోమాజిగూడ లో కలిసి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా సిరిసిల్ల ఆర్ టి సి డిపో( Sirisilla ) నుంచి కొనరావు పేట మీదుగా శివంగాల పల్లి, అక్కపల్లి, ఎల్లారెడ్డి పేట మీదుగా కామారెడ్డి వరకు పల్లె వెలుగు బస్ నడిపించాలని వినతి పత్రం అందజేశారు.అదే విధంగా ఎల్లారెడ్డి పేట బస్ స్టాండ్ లో ఆర్.టి.సి తరఫున షాపింగ్ కాంప్లెక్స్ భవనం నిర్మిస్తే దుకాణాల యజమానులు బతుకుతారు అని,అదే విధంగా ఆర్ టి సి కి కూడా ఆదాయం సమకూరుతుందని వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సానుకూలంగా స్పందించారు.