డంపింగ్ యార్డ్ ను సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డంపింగ్ యార్డ్( Dumping yard ) పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ , జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్( B Satya Prasad ), మున్సిపల్ కమిషనర్ అన్వేష్ లతో కలిసి అగ్రహారం సమీపంలో నిర్మాణంలో ఉన్న డంపింగ్ యార్డ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 The Dumping Yard Should Be Brought Into Use As Soon As Possible District Collect-TeluguStop.com

డంపింగ్ యార్డ్ లోని కంపోస్ట్ యార్డ్, ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రం, వర్మి కంపోస్ట్ , ఎఫ్ ఎస్ టి పి లను పరిశీలించారు.ఇప్పటికే సింహభాగం పనులు పూర్తి అయినందున షటర్ వర్క్, కిటికీల గ్రిల్స్ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.

ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రం ను సిరిసిల్ల మాదిరి నిర్వహించేలా ప్లాన్ చేయాలన్నారు.కంపోస్ట్ యార్డ్ నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని చెప్పారు.

డంపింగ్ యార్డ్ లో ప్రణాళికబద్ద పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలన్నారు.డంపింగ్ యార్డ్ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ప్రజారోగ్య విభాగం డి ఈ ఈ తిరుపతి, మున్సిపల్ ఏ.ఈ నరసింహ తదితరుల పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube