రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని,కోర్ట్ కేసుల్లో నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా కృషి చేయాలన్నారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.పెండింగ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు.
పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు.
SC/ST కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.పోక్సో యాక్ట్ ( POCSO Act )కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని,ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ,వ్యాపారస్తుల,ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా అధికారులు,సిబ్బంది పని చేయాలని,గంజాయి అక్రమ రవాణా,విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా నందు రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ఏవిధమైన చర్యలను తీసుకోవడం వలన ప్రమాదాలు తగ్గుతాయో అధికారులతో చర్చించి రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదాలు ఎక్కువగా జరుగు ప్రదేశాలను గుర్తించి వాటి నివారణకు సూచి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి రోడ్ల పై భారీ కేడ్స్ ను పెట్టాలన్నారు.
“మొబైల్ ఠాణా”( “Mobile Thana” ) కార్యక్రమంలో భాగంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తన సర్కిల్లో ఉన్న ఒకొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకొక్క గ్రామాన్ని సందర్శించి గ్రామ ప్రజలతో మమేకం అవుతూ ఉదయం నుండి వారికి అందుబాటులో ఉండి వారు ఇచ్చే పిర్యాదులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు.జిల్లాలో వివిధ డ్యూటీలు నిర్వహించె బ్లూ కోల్ట్, పెట్రో కార్,బందోబస్తు, ట్రాఫిక్ డ్యూటీలలో ఉన్న సిబ్బంది అధిక ఉష్ణోగ్రతలు దృష్ట్యా తగు జాగ్రత్తలు వహిస్తూ డ్యూటీలు నిర్వహించాలన్నారు.
జిల్లా పోలీస్ అధికారులకు బాడీ వార్మ్ కెమెరాలు అందజేశారు.ఈ కెమెరాలు బందోబస్తు, ట్రాఫిక్ డ్యూటీ ,నాకబంది,మొదలగు డ్యూటీలు చేసే సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేస్తుందని తద్వారా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేయవచ్చన్నారు.
గత నెలలు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సిబ్బందికి ప్రశంశ పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, రవికుమార్, సి.ఐ లు ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.