ఆరోగ్యంగా ఉంటేనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలుగుతాము

నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) రాజన్న సిరిసిల్ల జిల్లా : నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో తమ ఆరోగ్యంపై పట్టుసాధించవచ్చని,నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా ఎస్పీ అధికారులకు,సిబ్బందికి పిలుపునిచ్చారు.శనివారం రోజున ఉదయం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్( Headquarters ) లో యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి యోగా నిపుణులచే పోలీస్ సిబ్బందికి యోగాలో శిక్షణనిచ్చారు.

 We Can Perform Our Duties Effectively Only If We Are Healthy , Headquarters, Dis-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక,వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని.ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు.

కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్య భద్రత సద్వినియోగం చేసుకోవాలని 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు.ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, సి.ఐ లు అనిల్ కుమార్,ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube