వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది నామమే

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది నామమే అని ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు బిట్కూరి నవీన్ చార్యులు ప్రబోధించారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనములో సోమవారం జప ఏకాదశి సందర్భంగా అధ్యక్షులు శ్రీ బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ఉద్యమం 8-00 గంటల నుంచి 10-00 గంటల వరకు జప యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 In All The Vedas Naamam Shines Like The Sun, Vedas, Naamam , Sun, Hari Namam, R-TeluguStop.com

ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు.సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి సత్సంగం గావించారు.

మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు బిట్కూరి నవీన్ చార్యాలు నామ మహిమ ప్రవచనం చేశారు రామ కృష్ణ విష్ణు నామ మహిమ అపారమైనది.ఈ నామ ప్రభావమును గూర్చి నామ మహిమను గురించి అనేక శాస్త్రములలో దీనిని విశ్వాసముతో శ్రద్దగా వినాలని ఫలితముగా మీరు ఈ ఘోర సంసార సముద్రము నుండి తరిస్తారన్నారు.

హరినామమును ఉచ్చరించుట వలన సమస్త పాపములు తొలగిపోవునని అన్ని రకముల వ్యాధులు నిర్మూలనమగును.సమస్త దుఃఖములు సమసిపోతాయన్నారు.నరకములో నున్న వారు గూడ శీఘ్రముగా తరిస్తారన్నారు ,దాన, వ్రత, హోమాది సమస్త కర్మలు నామమునే ఆశ్రయించును.

వేదములన్నిటియందు సారభూతమై సూర్యుని వలె ప్రకాశించునది నామమే అన్నారు.

సమస్త పుణ్య తీర్ధముల (ఫలితము) కంటే నామము సర్వోత్క్రుష్టమని సమస్త శాస్త్రములు ఘోషిస్తున్నాయన్నారు.సమస్త శుభకర్మలు నామముపై ఆధారపడి యున్నవి.

ఐనను వాటి అన్నిటికంటే ఉత్తమ ఫలితమును ఒక్క నామమే ఒసంగును.భగవంతుని సర్వ శక్తులు నామము నందు ఇమిడి యున్నవి.

సమస్త జీవరాసులకు ఆనందము నిచ్చునది భగవన్నామమొక్కటే.శ్రద్ధతో హరినామమును కీర్తించినవారు జగత్తులో పూజనీయులు.

దిక్కులేని వారికి నామమే దిక్కు.పతితులను గూడ పావనులనుగా జేయు సామర్ధ్యము నామమునకు గలదని కృష్ణ నామమును సర్వకాల సర్వావస్తల యందు కీర్తించు వారు ఆ నామ సంకీర్తన వలననే ముక్తిని పొందుదురని.

వారికి వైకుంఠ ధామములో నిరంతరము హరిని కీర్తించు భాగ్యము, భగవత్ప్రీతియు కలుగునని.స్వయముగా నామమే పురుషార్ధములనిచ్చును.భక్తి అంగములలో నామము ప్రధానమైనదని శృతి, స్మృతి, శాస్త్రములు చెప్పుచున్నవి.దీనికి అసంఖ్యాకములైన ప్రమాణములు గలవు.

కళ్ళు మూసినప్పుడు దైవాన్ని ధ్యానంలోను, కళ్ళు తెరిచినప్పుడు ప్రకృతిలోనూ చూడగలిగితే సాధన సార్ధకమైనట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భక్త సంఘం ప్రతినిధులు గుండం రాజిరెడ్డి , లక్ష్మమ్మ, మహాదేవ్, ఆనంద రెడ్డి, రామ్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, మేగి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భక్తకోటీకి నవీన్ చార్యులు తీర్థప్రసాదాలు వితరన చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube