కస్తూరిబా విద్యాలయంలో యోగాసనాలు

అంతర్జాతీయ యోగా డే( International Yoga Day ) సందర్భముగా రాజన్న సిరిసిల్ల జిల్లా వైధ్య, ఆరోగ్య శాఖాధికారి డా.ఎ.

 Yogasanas At Kasturiba Vidyalayam-TeluguStop.com

సుమన్ మోహన్ రావు ల అధ్యక్షతన పెద్దూరు, తంగళ్ళపల్లి కస్తూరిభా గాంధీ బాలికల విధ్యాలయం( Kasturba Gandhi Balika Vidyalaya ) బాలికలకు యోగాభ్యాసము, ధ్యానం, ఆసనములు వేయడము నేర్పించారు.యోగాతో లభించే శారీరక, మానసిక, అధ్యాత్మిఆరోగ్య ప్రయోజనములను విపులీకరించారు.

యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు.శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయని, ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి తోడ్పడుతాయని అన్నారు.

అంతర్జాతీయ యోగా థీమ్ “యోగా సెల్ఫ్ అండ్ సొసైటీ” – “నా కోసం మరియు సామాజం కోసం యోగా“ అనే నినాదాన్ని ప్రజాలలోకి తీసుకు వెళ్లాలని అన్నారు.యోగా అనేది ఒక సంపూర్ణ జీవన విధానం.

ఇది నీతో, ప్రపంచంతో ప్రకృతితో ఏక రూప భావనను కనుగొనడానికి ఒక మార్గమని వివరించారు.ఒక్కొక్క ఆసనము వేయడము వలన ఒక్కో అవయవము ఉత్తేజ పరుస్తుందని అన్నారు.అవి .
1) శశాంక ఆసనము – ఏకాగ్రత పెరుగుతుంది 2) వజ్రాసనము – జీర్ణ శక్తి పెరుగుతుంది 3) వృక్షాసనము – కాళ్ళ నిలకడ శక్తి పెరుగుతుంది 4) సింహాసనము – నత్తి బాగవుతుంది 5) హలాసనము – ఏకాగ్రత పెరుగుతుంది 6) మలాసనము – మలబద్దకాన్ని నివారిస్తుంది 7) ప్రాణాయామం – జ్ఞాపక శక్తి పెరుగుట, శ్వాస మరియు ఛాతీ కండరాలు బలపడుతాయి మొదలగు మరెన్నో ఆసనములను ప్రతి రోజు ఉదయం చేయడం వలన ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమములో జిల్లా వైధ్య, ఆరోగ్య శాఖాధికారి డా.ఎ.సుమన్ మోహన్ రావు, ప్రోగ్రాం అధికారిణి డా.రజిత , డీపీవో ఎన్ ఎచ్ ఎమ్ ఉమ ప్రోగ్రాం అధికారిణి డా.నయీమా,పి ఎచ్ సి తంగళ్ళపల్లి వైధ్యాధికారిణి, డా.స్నేహ, ఆర్ బి ఎస్ కే వైధ్యాధికారి డా.షేక్ గౌస్ బాషా డా.కృష్ణవేణి, , కేజీబీవీ ప్రత్యేక అధికారిణులు, పి ఈ టి యోగా టీచర్ సంధ్య, సిహెచ్ఓ లు బాలచందర్, సత్యనారాయణ, హెచ్ ఈ ఓ లింగం, హెచ్ ఈ బాలయ్య, డి డి ఎం తిరుపతి, సంబంధిత ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube