రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలంలో ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం( Venugopalaswamy Temple ) పునర్నిర్మానం త్వరగా టెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని శుక్రవారం హైదరాబాదులో ఉన్న రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను కలిసిన వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడు మొదలవుతుంది అని అధికారులను అడగగా పేపర్ వర్క్ కంప్లీట్ కాగానే త్వరలో టెండర్లు పిలుస్తారని తెలియజేశారు.
కమిటీ వారు మాట్లాడుతూఎల్లారెడ్డిపేట భక్తులు సాంక్షన్ అయిన డబ్బులు క్యాన్సల్ అయిందని పుకార్లు నమ్మరాదని త్వరలో పునర్నిర్మాణం పనులు టెండర్ కాగానే పనులు మొదలయితాయని వేణుగోపాల స్వామి గుడికి శ్రీ వాణి ట్రస్టు ద్వారా డబ్బులు సాంక్షన్ అయినయ్ ఎటు పోవని తెలియజేశారు.
దేవదాయ శాఖ అధికారులను కలిసిన వారిలో వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సనుగుల ఈశ్వర్, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి,సలహాదారులు నంది కిషన్,చందుపట్ల లక్ష్మారెడ్డి, ఎనుగందుల నరసింహులు ఉన్నారు