వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ( YS jagan )నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం జరిగాయి.
ఈ క్రమంలో ఎన్నికలలో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు నేడు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.ఇదిలా ఉంటే రేపటి నుండి వైయస్ జగన్ పులివెందుల( Pulivendula )లో ఐదు రోజులపాటు పర్యటించబోతున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా ఈ ఐదు రోజుల పర్యటనలో రాయలసీమ( Rayalaseema ) జిల్లాల వైసీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశాలు నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు ఇకనుండి నిత్యం ప్రజలలో ఉండే విధంగా కార్యాచరణ కూడా రూపొందించుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్నికల ఫలితాలు అనంతరం చాలా చోట్ల వైసీపీ పార్టీ ( YCP party )కార్యకర్తలపై దాడులు జరిగాయి.ఈ దాడులలో కొంతమంది ప్రాణాలు విడిచారు.మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.ఈ క్రమంలో దాడులకు గురైన పార్టీ కార్యకర్తలని అదేవిధంగా మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను పలకరించాలని వైయస్ జగన్ డిసైడ్ కావటం జరిగిందట.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వైయస్ జగన్ పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.