శరవేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్లు - అడ్డుకున్న గ్రామస్తులు

రెవెన్యూ అధికారులు వచ్చేంతవరకు ఇసుక ట్రాక్టర్లను వదలమని తేల్చిచెప్పిన గ్రామస్తులు ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు, గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ రంగంలోకి దిగిన పోలీసులు ప్రజల ప్రాణాలు పోతే రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శరవేగంగా వెళ్తున్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు పది ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు.గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని, లేదంటే ఇసుక ట్రాక్టర్లు బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాల మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు.

 Speeding Sand Tractors - Obstructed By Villagers , Bhoppapur Village , Villagers-TeluguStop.com

ట్రాక్టర్ ఓనర్లు సంఘటన స్థలానికి రావాలని గ్రామస్తులు కోరగా… అక్కడికి చేరుకున్న ఓనర్లకు గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది, ఇసుక ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందని మేము ఇసుకను అడ్డుకోమని ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని ఓనర్లకు,డ్రైవర్లకు గ్రామస్తులు హెచ్చరించారు.ట్రాక్టర్ డ్రైవర్లు మాట్లాడుతూ.

మాకు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉందని తెలిపారు.రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే శరవేగంగా ట్రాక్టర్లు నడపమని రెవెన్యూ అధికారులు చెప్పారా.

అని గ్రామస్తులు కోపోద్రోక్తులయ్యారు.రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు సూచిస్తూ.

ప్రతి ట్రాక్టర్ కు ఇసుక పర్మిషన్లు తక్కువ ఇవ్వాలంటూ అధికంగా ఇవ్వడంతో ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు డబ్బు మత్తులో పడి శరవేగంగా నడుపుతున్నారని, ప్రజల ప్రాణాలు పోతే రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించాలని గ్రామస్తులు తెలిపారు.విషయం తెలుసుకున్న ఏఎస్ఐ కిషన్ రావు, పోలీసు బృందం సంఘటన స్థలానికి చెరుకొని డాక్టర్ డ్రైవర్లు ఓనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఏఎస్ఐ కిషన్ రావు మాట్లాడుతూ.గొల్లపల్లి గ్రామానికి చెందిన ఊరడి మహేష్ కంటైనర్ కింద పడి తల పగిలి చనిపోయాడని గుర్తు చేస్తూ.

ట్రాక్టర్లు శరవేగంగా వెళ్తే వాటి కింద గ్రామ ప్రజలు పడి చనిపోయే ప్రమాదం ఉందని.గ్రామస్తుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని డాక్టర్ డ్రైవర్లు గ్రామంలో వేగాన్ని తగ్గించి నడపాలని హెచ్చరించారు లేనియెడల ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇదే చివరి హెచ్చరికగా గుర్తు చేస్తూ మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని కిషన్ రావు తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube