అమరుల త్యాగం అజరామరం : ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎస్పీ అఖిల్ మహాజన్. ఫ్లాగ్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో క్రొవ్వొత్తుల ర్యాలీ, బైక్ ర్యాలీ.

 Immortal Sacrifice: Akhil Mahajan , Akhil Mahajan , Flag Day , Bike Rally , Raj-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా :పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన బైక్, క్రొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) పోలీస్ అధికారులు, సిబ్బంది.జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి నేతన్న చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, అక్కడి నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నిరవాళ్ళు అర్పించిన జిల్లా పోలీస్ యంత్రాంగం.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి అభినందనీయమని చెప్పారు.దేశ వ్యాప్తంగా ప్రజా క్షేమం కోసం పని చేస్తూ అమరులైన వారి త్యాగాలను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే( Flag Day ) నిర్వహిస్తున్నామని చెప్పారు.

అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలతో మరింత మమేకం అవుతూ మన్ననలు పొందాలని ఆయన సూచించారు.తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి పేరు ఉన్నదని, దానిని మరింత ఇనుమడింపజేసే విధంగా పని చేయాలన్నారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని,వారి ఆశయ సాధన కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.పోలీసుల అమరవీరుల వారోత్సవాలాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు,షార్ట్ ఫిలిమ్స్,ఓపెన్ హౌస్,బైక్ ర్యాలీ,రక్తధన శిబిరం కార్యక్రమలు నిర్వహించామని అన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube