భగవంత్ కేసరి హిట్... అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరోతోనేనా?

పటాస్ సినిమా ద్వారా డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) ఇప్పటివరకు ఏడు సినిమాలు చేశారు.అయితే ప్రతి ఒక్క సినిమా కూడా నిర్మాతలకు మంచి లాభాలను అందించిందని చెప్పాలి.

 Anil Ravipudi Next Planning To Raviteja After B Hagavanth Kesari Movie, Ani-TeluguStop.com

ఇలా ఈయన డైరెక్షన్లో వచ్చినటువంటి ఏడు సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ కాజల్ అగర్వాల్ ) ( Kajal Aggarwal )శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించినటువంటి భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Anil Ravipudi, Raja, Raviteja, Tollywood, Ustaadbhagat-Movie

ఇప్పటివరకు అనిల్ రావిపూడి కెరియర్లో సాధించలేని కలెక్షన్లను ఈ సినిమా సాధించిందని చెప్పాలి.ఇలా బాలయ్యతో చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుంది ఎలాంటి జానర్ లో ఉండబోతుందన్న విషయాలపై ఆత్రుత నెలకొంది.అయితే ఇప్పటివరకు అనిల్ రావిపూడి ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు గురించి ఎక్కడ ప్రకటించలేదు.

అయితే ఈయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతుంది అనే విషయాల గురించి ఒక వార్త వైరల్ గా మారింది.అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja ) తో చేయబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Anil Ravipudi, Raja, Raviteja, Tollywood, Ustaadbhagat-Movie

ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయనతో మరోసారి అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రాజా ది గ్రేట్( Raja The Great Movie ) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఇక ఈ సంక్రాంతికి ఈగల్ సినిమా ద్వారా రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా తర్వాత ఈయన తర్వాత తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని కాంబినేషన్లో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ రవితేజతో సినిమా చేయవచ్చని ప్రకటించారు.కానీ ఈయన పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా పూర్తి అయ్యేవరకు హరీష్ మరో ప్రాజెక్ట్ చేయరు కనుక ఈ గ్యాప్ లో రవితేజతో అనిల్ మరొక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలను కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube