రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కమీషనర్ ఆదేశాలమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికీ తాత్కాలిక పద్ధతిలో అతిథి అధ్యాపకుల నియామకం నిమిత్తం ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఈఓ) చింతల మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల- సిరిసిల్లలో గణితం 1, బాటనీ 1, జువాలజీ 1, సి.టి 1, ఎమ్.ఎల్.టి 1, ఎం.పి.హెచ్.డబ్ల్యు 1 ఖాళీ ఉండగా, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సిరిసిల్లలో జువాలజీ 1, ప్రభుత్వ జూనియర్ కళాశాల కోనరావుపేటలో ఫిజిక్స్1, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంటలో బాటనీ 1,కామర్స్ 1, హిందీ 1,
ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడలో బాటనీ 1, ఒ.ఎ (ఎస్.హెచ్) 1, ప్రభుత్వ జూనియర్ కళాశాల రుద్రంగిలో బాటనీ 1, జువాలజీ 1, కెమిస్ట్రీ 1, ప్రభుత్వ జూనియర్ కళాశాల గంభీరావుపేటలో గణితం 1, ఫిజిక్స్ 1,కెమిస్ట్రీ1, బాటనీ1, ప్రభుత్వ జూనియర్ కళాశాల ముస్తాబాద్ లో ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, ఎకనామిక్స్ 1, ప్రభుత్వ జూనియర్ కళాశాల యెల్లారెడ్డిపేటలో ఫిజిక్స్ 1, గణితం 1, ఎకనామిక్స్ 1, ఇంగ్లీష్ 1, ఖాళీగా ఉన్నాయి.పైన తెలిపిన మొత్తం 27 ఖాళీ పోస్టులకు గాను అర్హులైనవారు ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ, పి.జి., క్యాస్ట్ మరియు అదనపు విద్యార్హతలతోకూడిన దృవీకరణ పత్రాలు జిల్లా డి.ఐ.ఇ.ఒ ఆఫీసులో 24 జూలై 2023రోజు సాయంత్రం 5.00 గంటలలోగా ధరఖాస్తు చేసుకోవాలనీ ధరఖాస్తు చేసుకున్నవారికి తదుపరి సమాచారం అందించబడుతుందనీ డి.ఐ.ఇ.ఒ చింతల మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు.