సినిమా విజయం సాధించాలంటే కథతో పాటు హీరో, హీరోయిన్లు అత్యంత కీలకం.సినిమాలో నటించే హీరో, హీరోయిన్లను బట్టే సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది.
వారిద్దర కెమిస్ట్రీ కుదిరితేనే సినిమా హిట్ అవుతుంది.లేదంటే ఫట్ అవుతుంది.
అంతే తప్ప హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అనేది పెద్దగా ఎవరూ పట్టించుకోరు.ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా నడుస్తుంది.
వారితో పాటు యంగ్ హీరోయిన్స్ జత కడుతున్నారు.అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో కలిసి నటిస్తున్న హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రామ్ చరణ్ – కియారా
వీరిద్దరు కలిసి వినయ విధేయ రామ సినిమాలో నటించారు.రామ్ చరణ్ 2007 లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.అప్పటికి కియారా వయసు కేవలం 15 సంవత్సరాలు.
నాని – ప్రియాంక అరుళ్ మోహన్
నాని, ప్రియాంక హీరో, హీరోయిన్లుగా గ్యాంగ్ లీడర్ సినిమా చేశారు.నాని అష్ట చెమ్మ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సమయానికి ఇచ్చే టైంకి ప్రియాంక అరుళ్ మోహన్ వయసు 14 సంవత్సరాలు.
అల్లు అర్జున్-పూజ హెగ్డే
వీరిద్దరు కలిసి అలా వైకుంఠ పురంలో సినిమాలో నటించారు.అల్లు అర్జున్ గంగోత్రి సినిమా తో ఎంట్రీ ఇచ్చే టైం కి పూజ వయసు కేవలం 13 సంవత్సరాలు.
మహేష్ బాబు- రష్మిక
తాజాగా వీరిద్దరు కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమా చేశారు.మహేష్ బాబు రాజకుమారుడు సినిమా తో ఎంట్రీ ఇచ్చే టైం కి రష్మిక వయసు కేవలం మూడు సంవత్సరాలు కావడం విశేషం.
రవితేజ – పాయల్ రాజపుత్
వీరిద్దరు కలిసి తాజాగా డిస్కో రాజా సినిమా చేశారు.1999లో రవితేజ నీకోసం సినిమా చేసే సమయానికి పాయల్ వయసు కేవలం 7 సంవత్సరాలు.
ప్రభాస్- శ్రద్ధ కపూర్
వీరిద్దరు కలిసి సాహో సినిమాలో జతకట్టారు.ప్రభాస్ 2002 లో ఈశ్వర్ మూవీ తో ఎంట్రీ ఇచ్చే సమయానికి శ్రద్ధ కపూర్ ఏజ్ 15 సంవత్సరాలు మాత్రమే.
ఎన్టీఆర్ – పూజ హెగ్డే
వీరిద్దరు నటించిన తాజా సినిమా అరవింద సమేత.ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో ఎంట్రీ ఇచ్చే సమయానికి పూజ వయసు 11 ఏండ్లు.
పవన్ కళ్యాణ్ – కీర్తి సురేష్
వీరిద్దరు కలిసి నటించిన సినిమా అజ్ఞాతవాసి.పవన్ 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో ఎంట్రీ ఇచ్చే సమయానికి కీర్తి సురేష్ వయసు కేవలం నాలుగేళ్లు.