“ఓడలు బళ్లవుతాయి… బళ్ళు ఓడలవుతుంటాయి” అని నానుడి.ఇది అక్షర సత్యం అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఆ నటి జీవితంలో అది చాలా నాటకీయంగా జరిగిందని చెప్పుకోవచ్చు.ఆమె మీద ఓ బయోపిక్ తీస్తే మరో మహానటి అవుతుంది.
అది 90ల కాలం.అలనాటి బాలీవుడ్ నటి కోసం రిషికపూర్ ( Rishi Kapoor )నుంచి మొదలు పెడితే సంజయ్ దత్ వరకు కాల్ సీట్స్ కోసం క్యూలో ఉండేవారు.
ఆమె తమ సినిమాలో నటిస్తే చాలు సూపర్ హిట్ అవుతుందనే భావన అనేకమందికి అపుడు ఉండేది.పైగా మంచి వయసులో ఉండటంతో ఆమె నటనకు, డ్యాన్సులకు ప్రేక్షక లోకం ఊగిపోయేది.
అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె కనబరిచేది.
అవును, “దేశ్ పరదేశ్”( Desh Pardesh ) అనే సినిమా ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆమె బాలీవుడ్లో గోల్డెన్ లెగ్ లాగా అవతరించింది.రిషి కపూర్, రాజేష్ ఖన్నా, అమల్ పారేఖ్ వంటి దిగ్గజ నటులతో ఆమె జతకట్టింది.ఈ క్రమంలో వరుస విజయాలతో తిరుగులేని స్టార్ డం అనుభవించింది.
ఆ తరువాత కాలంలో ఆమెని వరుస పరజయాలు చాలా ఇబ్బందులకు గురి చేసాయి.వరుసగా ప్లాపులు ఉన్నప్పటికీ 1987లో ఆమె రెండు సినిమాలు చేసింది.1991లో జిగర్వాలా( Jigarwala ) చిత్రంలో చివరిసారిగా కనిపించింది.అయితే సదరు నటి చాలామందితో ప్రేమాయణం నడిపిందని అప్పట్లో పుకార్లు షికారు చేసేవి.
ఆఖరికి రిషి కపూర్ తో కూడా ఆమెకి ఎఫైర్ ఉందని వినిపించేవి.అయితే అదంతా అబద్ధమని రిషి కపూర్ తన ఆత్మ కథలో వెల్లడించడంతో దానికి ఫుల్ స్టాప్ పడింది.
ఇక్కడ మరో చమత్కారం ఏమిటంటే, ఇది నిజం అనుకున్న సంజయ్ దత్ గొడవపడేందుకు తన ఇంటికి కూడా వచ్చాడని ఆయన అందులో రాసుకొచ్చారు.దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో.కాగా ఆమె 1991 ఫిబ్రవరి 2న ఆమె ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.తర్వాత సినిమాలకు విరామం ప్రకటించింది.ఒకానొక దశలో ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ పదివేల కోట్లకు చేరింది.ఆ తరువాత తరచూ ఆమె వివాదాలలో తల దూర్చడం వల్ల ఆమె పతనం మొదలయ్యింది.
ఆమె సంపద, ఆమె భర్త సంపద కరిగిపోవడం ప్రారంభమైంది.ఇలా ఆమె ఆస్తులు ప్రస్తుతం 2000 కోట్లకు పడిపోయాయి.
ఆమె ఎవరో కాదు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ( Teena Ambani ).