మనిషిలో ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే అంగవైకల్యం అనేది అసలు అడ్డే కాదని, ఎన్నో సవాళ్లను అధిగమించి తన సంకల్ప బలంతో యువకుడు సరికొత్త రికార్డు సృష్టించాడు.గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన స్మిత్ చాంగెలా( Smith Changela ) చిన్నప్పటినుండి న్యూరోపతితో బాధపడుతున్నాడు.
కాబట్టి చిన్నప్పటినుండి నరాలకు వచ్చే వ్యాధితో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.చేతితో మొబైల్ ఫోన్ టైపింగ్ చేస్తుంటే చేతులలోని నరాలు ఎక్కువగా నొప్పి వచ్చేవి.
అయితే పట్టుదలతో కాస్త డిఫరెంట్ గా ఆలోచించి కరోనా లాక్ డౌన్ సమయంలో ముక్కుతో ఫోన్లో టైపింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకుండా నెమ్మదిగా టైపింగ్ చేస్తూ వేగంగా టైపింగ్ చేసే విధంగా ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.

ప్రస్తుతం స్మిత్ చాంగెలా ఒక నిమిషంలో 151 అక్షరాలు అంటే 36 పదాలను ఫోన్ లో సులభంగా టైప్ చేయగలుగుతాడు.దీంతో ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్డు( India Book of Records )లో స్థానాన్ని సంపాదించాడు.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్( India Book of Records )నుండి గుర్తింపు పత్రం పొందిన స్మిత్ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.తనలాంటి దివ్యాంగ యువకులు దేశంలో ఎంతోమంది ఉన్నారని, వారు కూడా జీవితంలో ఎక్కడో ఒకచోట కచ్చితంగా తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉంటారని తెలిపాడు.వారందరూ కూడా అధైర్య పడకుండా ధైర్యంతో అడుగులు ముందుకు వేయాలని, వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకోవాలని స్మిత్ తెలిపాడు.ఏదైనా చేయాలి అనే పట్టుదల మనలో గట్టిగా ఉంటే అంగవైకల్యం లాంటివి అడ్డు రావని, అద్భుత విజయాలు చేరువ అవుతాయని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం స్మిత్ బీకాం చదువుతూ.యూపీఎస్సీ పరీక్షలకు( UPSC Exams ) సిద్ధమవుతున్నాడు.







