నందమూరి బాలకృష్ణ( Balakrishna ) నందమూరి హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఊహించని స్థాయిలో మాస్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ కలిగి ఉండి ఈ మధ్య కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోలలో బాలయ్య ఒకరు కాగా బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా ( Veera Simha Reddy )కర్నూలులోని ఆలూరులో ఉన్న ఎస్ఎల్ఎన్ఎస్ థియేటర్ లో ఏకంగా 200 రోజుల పాటు ప్రదర్శించబడింది.బాలయ్య నటించిన సింహా, లెజెండ్ మరికొన్ని సినిమాలు సైతం ఎక్కువ రోజుల పాటు ప్రదర్శించబడి అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ రోజుల పాటు సినిమాలు ప్రదర్శించబడి అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం బాలయ్యకే సాధ్యమని కొంతమంది అభిప్రాయం వ్యక్తచేస్తున్నారు.బాలయ్య భగవంత్ కేసరి గత సినిమాలను మించి ఉండనుందని తెలుస్తోంది.
మాస్ ప్రేక్షకులను, క్లాస్ ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.కాజల్, శ్రీలీల ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా ఉండనున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా ఉండనున్నాయని భోగట్టా.అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో భగవంత్ కేసరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
బాలయ్య పారితోషికం కంటే అద్భుతమైన కథ, కథనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.మాస్, క్లాస్ సినిమాలలో నటిస్తున్న బాలయ్య తన సినిమాలు మరింత ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వరుస విజయాలు బాలయ్య రేంజ్ ను పెంచుతుండగా బాలయ్యకు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.బాలయ్య భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో సైతం నటించాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో బాలయ్య కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.