తమిళ స్టార్ హీరో, సింగర్ ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక తన పాటలకు కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పటివరకు తెలుగు సినిమాలలో నటించని ధనుష్ కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ప్రస్తుతం వరుస సినిమాలలో బాగా బిజీగా ఉన్నాడు ధనుష్.ఇదిలా ఉంటే తనకు సినిమాలలో నటించడం ఇష్టం లేదట.
అదేంటి స్టార్ హోదాలో ఉన్న ధనుష్ సినిమాలలో నటించడానికి ఇష్టం లేదని అంటున్నారని అనుకుంటున్నారా అది ఇప్పుడు కాదులేండి.తాను హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టక ముందు.
నిజానికి చూడటానికి హీరో లక్షణాలు కూడా సరిగ్గా లేని ధనుష్ కు సినిమాలలో నటించాలని అస్సలు ఇష్టం లేదట.కేవలం తన తండ్రి వల్లే ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం స్టార్ హీరో హోదాను సంపాదించుకున్నాడు.
ఈరోజు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1983లో మద్రాస్ లో జన్మించిన ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా.ఇక ఈయనకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు.తన సోదరుడు సెల్వరాఘవాన్ మంచి దర్శకుడిగా గుర్తింపు పొందాడు.ఇక తన తండ్రి కస్తూరి రాజా కథలు రాసి సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు.అలా ధనుష్ కి నటన మీద ఆసక్తి లేకున్నా కూడా ధనుష్ వద్దన్నా కూడా తన తండ్రే బలవంతంగా హీరోగా చేశాడట.
అలా తన తండ్రి దర్శకత్వంతో తెలుగు సినిమాలో అడుగుపెట్టిన ధనుష్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.కానీ తనకు మాత్రం కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి తన సోదరుని దర్శకత్వంలో మరో సినిమాలో నటించాడు.ఇక ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్.అలా తన తండ్రి తన పట్ల తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నానని.ఎంతో ఆనందంగా ఉందని చాలాసార్లు తెలిపాడు.
ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానున్నాడు ధనుష్.