మోడల్ లేఅవుట్ ను సిద్ధం చేయాలి

పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి.సమీక్ష సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజక వర్గంలోని తిప్పాపూర్, మారుపాకలోని 32 ఎకరాల్లో మోడల్ లేఅవుట్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

 Model Layout Should Be Prepared , Collector Anurag Jayanthi, Tippapur, Marupaka-TeluguStop.com

వేములవాడ ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్ తో జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు.

ఆయా గ్రామాల్లో 32 ఎకరాలలో మోడల్ లేఅవుట్ లో పూర్తిస్థాయిలో రోడ్డు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు నాణ్యతతో నిర్మించాలని ఆదేశించారు.ఈ లేఅవుట్ కోసం భూమిని ఇస్తున్న వారికి అదే డెవలప్మెంట్ లేఅవుట్ లో ఇవ్వాలని, దీనికోసం ఏర్పాట్లు చేయాలని వేములవాడ ఆర్ డి ఓ, మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

ఈ సందర్భంగా ఆ స్థలం మ్యాప్ ను పరిశీలించారు.సమావేశం లో వేములవాడ ఆర్ డి ఓ మధుసూదన్, కమిషనర్ అన్వేష్, తహశీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube