రాజన్న సిరిసిల్ల జిల్లా: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ అన్నారు.గురువారం గంభీరావుపేట మండల( Gambhiraopet ) కేంద్రంలో కార్పొరేషన్లను ఏర్పాటును స్వాగతిస్తూ పలుకుల సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న బడుగు బలహీన, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం,వారికి ఇది ఒక సువర్ణ అవకాశమని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఎలక్షన్ల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, అంతేకాకుండా పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.
పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తుందని, సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్ని రకాలుగా కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాపా గారి రాజా గౌడ్, స్థానిక మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్, ఎంపిటిసి పర్శరాములు కొత్తపల్లి మాజీ సర్పంచ్ రాజా నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ( Congress party ) నాయకులు చంద్రారెడ్డి, లచ్చయ్య, రాజిరెడ్డి, ఓరుగంటి నర్సింలు, మెడ భాస్కర్, ఎర్ర నరసయ్య, ఉస్ర్ ష్రతుల్లా , పంతం సురేష్, అజ్మీరా భాస్కర్ నాయక్, లచ్చయ్య, కోట భూమయ్య వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.