దేశంలో మరో నెల రోజులలో సార్వత్రిక ఎన్నికలు( General Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో గెలవడానికి జాతీయ పార్టీల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టడం జరిగింది.ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో సొంత సోదరుడని కూడా విభేదించి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబున్ బెనర్జీ ప్రతి ఎన్నికకు ముందు ఏదో ఒక గొడవ తీసుకొస్తారంటూ దీదీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
రాజకీయాలలో అత్యాశపరులను నేను ఆదరించను.వారసత్వ రాజకీయాలను నేను నమ్మను దూరంగా ఉంటా అందుకే సొంత సోదరుడికి కూడా టికెట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే నేడు మమతా బెనర్జీ తీవ్ర గాయాలు పాలయ్యారు.
ఆమె నుదుటికి బలమైన గాయం తగలడంతో బాగా రక్తం కారుతూ ఉంది.నుదుటిపై గాయంతోనే ఆసుపత్రిలో దీదీ చికిత్స తీసుకుంటూ ఉన్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటో తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరిగింది.అయితే మమతా బెనర్జీ ఎలా గాయపడ్డారు అనేది తెలియాల్సి ఉంది.
దేశంలో సరిగ్గా ఎన్నికలు వస్తున్నా సమయంలో మమతా బెనర్జీకి గాయం కావడంతో టిఎంసి పార్టీ కార్యకర్తలు నాయకులు తల్లడిల్లుతున్నారు.