బీభత్సవం సృష్టించిన గాలి వాన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet )లో 25 తారీఖు నా రోహినీ కార్తే ప్రారంభమైన రోజున గాలి వాన భీభత్సవానికి చెట్లు నేలకూలాయి వాహనాలు నిలిచిపోయి.

 Whirlwind Created Chaos, Whirlwind, Rain ,power Supply , Rajanna Sirisilla Dist-TeluguStop.com

రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోన్నారు.వర్షం అంతంత మాత్రమే కురిసింది.నారాయణపూర్ నుండి రాగట్లపల్లి వెళ్లే ప్రదాన రహదారిలో గాలి వాన భీభత్సవానికి చెట్లు నేలకూలాయి .విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.దీంతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.

అదేవిధంగా పదిర బ్రిడ్జి సమీపంలో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన దారిలో అదేవిధంగా వెంకటాపూర్ ఆది పెరుమండ్ల స్వామి ఆలయం సమీపంలో కామారెడ్డి ( Kamareddy )సిరిసిల్ల ప్రధాన రహదారి పై చెట్లు విరిగిపోయి వాహాన రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.వెంకటాపూర్ ,పదిర నారాయణపురం గ్రామాలలో పోలీసులు , గ్రామపంచాయతీ సిబ్బంది , సెస్ సిబ్బంది విరిగిపోయిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube