గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందే చూసుకోవాలి, ఎలక్ట్రానిక్ పరికరాలకు పరీక్ష కేంద్రాలలోకి అనుమతి లేదు, టీజీపీఎస్సీ ఛైర్మెన్ మహేందర్ రెడ్డి
ఈ నెల 9 వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 preliminary) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీజీపీఎస్సీ ఛైర్మెన్ మహేందర్ రెడ్డి సూచించారు.ఈ నెల 9 వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై హైదరాబాద్ (Hyderabad)లోని టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి ఛైర్మెన్ మహేందర్ రెడ్డి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీలు, రీజినల్ కో ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు.ఈ సందర్బంగా టీజీపీఎస్సీ ఛైర్మెన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాన్నం 1.00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1000 సెంటర్లు(1000 centers) ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఈ పరీక్షకు దాదాపు 4 లక్షలకు పైగా మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.

 Group-1 Preliminary Examination Should Be Conducted In Full Swing, Additional Sp-TeluguStop.com

టీజీపీఎస్సీ నుంచి వచ్చే పరీక్ష పత్రాలు, ఓఎం ఆర్ షీట్లు జాగ్రత్తగా భద్ర పర్చాలని, కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండాలని, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.పరీక్ష నిర్వహించే రోజున పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లను తరలించాలని, పూర్తి అయిన తర్వాత అలాగే వాటిని తిరిగి పంపాలని ఆదేశించారు.

కేవలం చీఫ్ సూపర్ ఇండెంట్ మినహా ఎవరూ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లవద్దని స్పష్టం చేశారు.పరీక్ష విధులు నిర్వర్తించే అబ్జర్వర్, రూట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.

ప్రతి కేంద్రంలో మహిళలు, పురుషులకు వేరువేరుగా తనిఖీ గదులు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు పోలీస్ సిబ్బందిని నియమించాలని సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఆర్టీసీ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపించాలని, సెస్ అధికారులు విద్యుత్ సరఫరా లో ఎలాంటి లోపం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలకు ఏర్పాటు చేయాలని సూచించారు.అందరూ కలిసి సమన్వయంతో పరీక్షను విజయ వంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో 15 కేంద్రాలు

జిల్లాలో 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్, నోడల్ ఆఫీసర్ పూజారి గౌతమి తెలిపారు.ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 9398684240 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని సూచించారు.అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రంవద్ద మంచినీరు, టాయిలెట్లు సక్రమంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ముందుగానే చేరుకోవాలి

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని ఒక రోజు ముందే చూసుకోవాలని అదనపు కలెక్టర్, నోడల్ ఆఫీసర్ పూజారి గౌతమి సూచించారు.పరీక్ష జరిగే రోజు ఉదయం 9.00 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.ఉదయం 10.00 గంటల తర్వాత అనుమతి ఉండదని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్సీఓ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్, పర్యవేక్షకులు వేణు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube