శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత - మంత్రి కేటీఆర్

తంగాలపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ నుండి సిరిసిల్ల ,అగ్రహారం,నంది కామన్, వెంట్రావుపల్లి బార్డర్ వరకు ప్రధాన రహదారి వెంబడి సింగరేణి వారి సహకారంతో ఏర్పాటు చేసిన 80 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి.దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు.

 First Priority For Maintaining Law And Order Minister Ktr Details, Maintaining-TeluguStop.com

జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రంను మంత్రి ప్రారంభించారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు,సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలు పోలీస్ కార్యాలయంలోని తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వార కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ సేవలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని మంత్రి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా కనిపెట్టే పరిస్థితులు వున్నాయని, పోలీసుల ఆత్మగౌరవం పెరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్నది అన్నారు.

ప్రజల ధన మాన ప్రాణ రక్షణనే ద్యేయంగా పోలీసులు విధులు నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలో పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు.జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు,సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాలు,

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

నూతనంగా సింగరేణి వారి సహకారంతో తంగాలపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ నుండి సిరిసిల్ల, అగ్రహారం, నంది కామన్,వెంకట్రావుపల్లి బార్డర్ వరకు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేయడం జరిగిందని,కమాండ్ కంట్రోల్ ద్వారా జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చు అన్నారు.మంత్రి వెంట జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్ టైల్, పవర్ లూమ్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టెస్క్యాబ్ చైర్మన్ కొండూరు రవీందర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య,మున్సిపల్ చైర్మన్ జింధం కళ, పోలీస్ అధికారులు,టి-ఫైబర్ మేనేజిగ్ డైరెక్టర్,యజమాన్యం ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube