రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంకు జన చైతన్య యాత్ర పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు( Petrol Diesel Prices ) తగ్గించాలని మార్చి 10వ తేదీన భద్రాచలంలో ప్రారంభమైన బైక్ యాత్ర శుక్రవారం తూతిక ప్రకాష్ తన బైకుపై గ్యాస్ సిలిండర్ బుడ్డిని పెట్టుకొని, ప్లకార్డులు అంటించుకుని ఎల్లారెడ్డిపేటకు చేరుకున్నాడు.ఎల్లారెడ్డిపేట చేరుకున్న బైక్ యాత్రకు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.తెలంగాణకు రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వాటను వెంటనే ఇవ్వాలని ఉద్దేశంతో ప్రజలందరి భాగస్వామ్యంతో బైకు ర్యాలీ( Bike Rally ) నిర్వహిస్తున్నానని పేర్కొన్నాడు.తెలంగాణ రాష్ట్రమంతా అడవి ప్రాంతాల గుండా మైదాన ప్రాంతంలో ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ కొనసాగిస్తున్నానని ఈ యాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని అన్నారు.
కరోనా సమయంలో కూడ సైకిల్ పై ఉమ్మడి ఖమ్మం జిల్లా( Khammam ) ప్రజలను మనోధైర్యాన్ని కల్పించానని, తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక రైతు బిడ్డగా , గ్రామీణ వైద్యులుగా ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు.బైక్ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డిపేటకు చేరుకున్న తూతిగా ప్రకాష్ ను ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వీర్నపల్లి మండల అధ్యక్షులు రాజిరెడ్డి,దేవరాజ్, జావిద్, సతీష్, సాయికుమార్ తను చేస్తున్న వినూత్న నిరసనకు మద్దతు పలికారు.