కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఫ్యాన్ వితరణ చేసిన ఉపసర్పంచ్ దంపతులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు స్థానిక ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు ఫ్యాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెట్ ఎగదండి బాబుకు అందజేశారు.ఇటీవల మన గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసింది.

 Subsarpanch Couple Distributed Fan To Community Health Center, Donated Fan ,com-TeluguStop.com

శనివారం ఇట్టి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ దంపతులు సందర్శించి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఫ్యాన్లు లేక ఉడక పోస్తుందని,దోమలు కుడుతున్నాయని పేషంట్లు చెబుతున్నారని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ చెప్పగా వెంటనే పేషెంట్లకు ఇబ్బందులు పడకుండా ఫ్యాన్ ను తెప్పించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ బాబుకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ రఘు, డాక్టర్ ప్రదీప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని స్రవంతి,రజనీ,హెల్త్ సెంటర్ సూపర్ వైజర్స్ మేరీ, పద్మ, కొమురయ్య స్టాఫ్ నర్స్ లావణ్య డాటా ఎంట్రీ ఆపరేటర్ అరవింద్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube