రెవెన్యూ డివిజన్ సాధన కోసం సంతకాల సేకరణ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరుతూ వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానుల వద్ద నుండి రెవెన్యూ డివిజన్( Revenue Division ) సాధన కావాలని కోరుకుంటూ మద్దతు ఇస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంనకు పంపే లేఖ పై వారు సంతకాలు చేశారు.మొదటి సంతకం రెవెన్యూ డివిజన్ లో బాగంగా సీనియర్ జర్నలిస్టు ఎదురుగట్ల ముత్తయ్య తో ప్రారంబించారు.

 Collection Of Signatures For Revenue Division Instrument , Signatures-TeluguStop.com

ఇక ప్రతి గ్రామగ్రామాన సంతకాల సేకరణ,గ్రామ పంచాయతీ సర్పంచ్ లను, పాలకవర్గాలను రెవెన్యూ డివిజన్ సాధన కోసం గ్రామగ్రామాన తిరిగి మద్దతు కోరుతామని వారు తెలిపారు రెవెన్యూ డివిజన్ ఎల్లారెడ్డి పేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ గా ఎల్లారెడ్డిపేట ను ప్రకటించాలని కోరుతూ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని దుకాణాల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.సంతకాలు సేకరించిన పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కెటిఆర్ కు సేకరించిన సంతకాల పత్రాలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు సాధన సమితి సభ్యులు తెలిపారు.

అతి త్వరలో మంత్రి కెటిఆర్ రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని దుకాణదారులు ఆశాభావం వ్యక్తంచేశారు.ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్, వెంట బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మటి నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మా రెడ్డి, రఫిక్, చెన్ని బాబు,టిడిపి జిల్లా నాయకులు మాలోత్ సూర్య నాయక్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వరద వెళ్లి స్వామి,తాటిపెళ్లి అంజయ్య, లింగాల సందీప్, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube