రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాల పట్ల ప్రత్యేక శిక్షణను పొంది సైబర్ వారియర్స్ గా నియమింపబడిన సిబ్బందికి ఫోన్లు మరియు సిమ్ కార్డులను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేషిన జిల్లా ఎస్పీ. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ….
జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక్కో సైబర్ వారియర్ చొప్పున 13 మందిని నియమించడం జరిగిందని,సైబర్ వారియర్స్ గా శిక్షణ పొంది పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఒక ఫోన్ నెంబర్ ఉంటుందని తెలియజేసారు.సైబర్ నేరాల బారిన పడిన ప్రజలు వెంటనే 1930 కి కాల్ చేయడం గానీ,ఎన్ సి ఆర్ పి పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం గానీ చేయాలన్నారు.
బాధితులు ఫిర్యాదులను నమోదు చేసుకుంటేనే గుర్తించడం సులువవుతుందని తెలియజేశారు.సైబర్ నేరాలకు గురైన బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకే సైబర్ వారియర్స్ ను పోలీస్ శాఖ తరపున ప్రతి పోలీస్ స్టేషన్లో నియమించడం జరిగిందని,సైబర్ నేరాల బారిన పడిన ఫిర్యాదు చేసిన బాధితుడికి సంబంధిత పోలీస్ స్టేషన్లో నియమింపబడిన సైబర్ వారియర్ ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని,కావున జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
పోలీస్ స్టేషన్ ల వారీగా సైబర్ వారియర్స్ ఫోన్ నంబర్స్1.సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్.= 8712657807.2.తంగాల్లపల్లి పోలీస్ స్టేషన్.= 8712657810.3.ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్.= 8712657803.4.ముస్తాబద్ పోలీస్ స్టేషన్.= 8712657806.5.ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్.= 8712657809.6.గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్.=8712657804.7.వీర్నపల్లి పోలీస్ స్టేషన్.= 8712657811.8.వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్.= 8712657808.9.వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్.= 8712657812.10.బోయినపల్లి పోలీస్ స్టేషన్.= 8712657801.11.చందుర్తి పోలీస్ స్టేషన్.= 8712657802.12.కొనరావుపేట్ పోలీస్ స్టేషన్.= 8712657805.13.రుద్రాంగి పోలీస్ స్టేషన్.= 8712657813.